April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

సంచలనం సృష్టిస్తున్న వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

1 min read

 

భీమ్ న్యూస్ మచిలీపట్నం ప్రతినిధి (ఏప్రిల్ 01) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు సంచలనం సృష్టిస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఫించన్లు పంపిణీకి వారిని ఎన్నికల కమీషన్ దూరం పెట్టిన నేపథ్యంలో రాజీనామాలు చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది రాజకీయ నాయకులు తమ సేవలకు రాజకీయాలను ఆపాదించి ఈసీకి ఫిర్యాదు చేశారని, దీంతో మనస్తాపానికి గురై రాజీనామాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలోనే 1200 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు సమాచారం. తెర వెనుక వుండి వైసీపీ నాయకులే వాలంటీర్లు చేత మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *