April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

వైసిపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా?

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి గురజాల (ఏప్రిల్ 01) పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో నేత షాకిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి యాదవ్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన ఐదు లేదా ఆరో తేదీన  టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు అనుచరులు కూడాపెద్ద ఎత్తున టీడీపీలోచేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే  టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు.  జంగా రాకతో పల్నాడు జిల్లాలో టీడీపీకి మరితం బలం చేకూరనుంది.  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేశాను. కానీ, నా విధేయతను పార్టీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కాసు మహేష్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాను. కానీ, ఈ రోజు గురజాలలో మళ్లీ మహేష్‌రెడ్డికి సీట్ ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీ అధిష్టానం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయలేకపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు జంగా కృష్ణమూర్తి. అందుకే అలాంటి పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం టీడీపీలోకి వెళ్తున్నానని ప్రకటించారు. పార్టీని వీడడం ఎంతో బాధాకరంగా కూడా ఉందని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి, బీసీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం, భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టు ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి వెల్లడించారు. 

కొద్ది రోజుల కిందటే జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరుతారని అనుకున్నారు. ఆయన పేరును గురజాలతో పాటు నర్సరావుపేట అసెంబ్లీ స్థానాలకు పరిగణనలోకి తీసుకున్నారు. అయితే సర్వేల్లో సానుకూల ఫలితాలు రాకపోవడం ఆయా స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉండటంతో టిక్కెట్లు కేటాయించలేకపోయారు. ఈ కారణంగా చేరిక ఆలస్యం అయింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన లావు కృష్ణదేవరాయులుకు జంగాకృష్ణమూర్తి అత్యంత సన్నిహితుడు. ఈ కారణంగా టీడీపీ అధినేతతో చర్చించి  జంగా కృష్ణమూర్తికి ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు హామీ ఇప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *