తోటపల్లి గూడూరు మండలంలో భారతీయ మహాసేన ఆత్మీయ సమావేశం
1 min read
భీమ్ న్యూస్ తోటపల్లి గూడూరు (ఏప్రిల్ 01) నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని మాచర్లవారిపాలెం ఎస్సీ, ఎస్టీలతో భారతీయ మహాసేన (బి.ఎం.ఎస్.) రాష్ట్ర, జిల్లా కార్యవర్గ బృందం ఆదివారం సాయంత్రం ఆత్మీయ సమావేశమయ్యారు. తొలుత మండల కేంద్రంలో వున్న బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా మాచర్లవారిపాలెం గ్రామానికి చేరుకుని ఎస్సీ, ఎస్టీ లతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో యువత బాధ్యతగా తీసుకుని గ్రామస్తులందరినీ ఒకచోటకు చేర్చడం, ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయడం విశేషం. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన దార్ల చంద్రశేఖర్ కి, హేమంత్ కి, గ్రామ యువతకు బి.ఎం.ఎస్. బృందం ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ మహాసేన రాష్ట్ర అధ్యక్షులు జువ్విగుంట బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల రాధాకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొచ్చు సాంబశివ, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కర్నాటి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బొర్రా చంద్రమౌళి, కార్యదర్శులు కత్తి శివ, కోటయ్య, సూరిపాక శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు రాచూరి మధు, మాచర్లవారిపాలెం, చుట్టు పక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.