ఏపీలో రెండో విడత ప్రజాగళం – చంద్రబాబు భళాభళి
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి మంగళగిరి (ఏప్రిల్ 03) సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 3న కొత్తపేట, రామచంద్రాపురం, 4న కొవ్వూరు, గోపాలపురంలో రోడ్ షో లో పాల్గొంటారు. 5న నరసాపురం, పాలకొల్లు, 6న పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం, 6 గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. తొలివిడతలో 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షో ల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్ షో లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు చంద్రబాబు భళాభళిరా అంటూ ఆకాశానికి ఎత్తుకున్నారు.