April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఏపీలో ఎండల కాక: వడదెబ్బకు ఉపాధ్యాయురాలు మృతి.

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి నందిగామ (ఏప్రిల్ 02) వడదెబ్బ తగిలి ఓ ప్రయివేటు స్కూలు ఉపాధ్యాయురాలు మృతి చెందారు. ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ శ్రీ చైతన్య పాఠశాలల ఉపాధ్యాయురాలుగా స్వరూపరాణి (40) పని చేస్తున్నారు. నూతన విద్యార్ధుల అడ్మిషన్ల కోసం సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ క్రమంలో ఎండ తీవ్రతకు తాళలేక సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన తోటి ఉపాధ్యాయులు హుటాహుటిన ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *