జన సందోహంతో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారంలో దువ్వాడ శ్రీనివాస్
1 min read
భీమ్ న్యూస్ టెక్కలి ప్రతినిధి (ఏప్రిల్ 02) శ్రీకాకుళం జిల్లా వైయస్ఆర్ సిపి పార్టీ జిల్లా అధ్యక్షులు నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, టెక్కలి నియోజకవర్గం 2024 వైయస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు మరియు మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకట రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్కలి టౌన్ లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టెక్కలి చేరి వీధిలోని కిల్లి పోలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం చేసుకుంటు అంబేద్కర్ కూడలి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అనంతరం వైయస్ఆర్ కూడలి వరకు ప్రచారం చేసుకుంటూ వెళ్లి మరల బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గంలోని పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ సభ్యులు, వైస్ ఎంపీపీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎక్స్.ఎంపీపీ లు, మండల పార్టీ కన్వీనర్ లు, వార్డు సభ్యులు, జెసిఎస్ కన్వీనర్ లు, గృహసారదులు, వివిధ హోదాలలో గల సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.