April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

దిగుతూ రైలు కింద పడి ఉపాధ్యాయుడు మృతి

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి గూడూరు (ఏప్రిల్ 02) రైలు దిగుతుండగా కాలుజారి పడి ఓ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన గూడూరు రైల్వేస్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే జీఆర్‌ పోలీసుల కథనం మేరకు నెల్లూరులోని హరినాథపురంలో నివాసం వుంటున్న కృష్ణప్రసాద్‌ (42) గూడూరు మండలం వెందోడు ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. రోజూ నెల్లూరు నుంచి పాఠశాలకు వచ్చి వెళ్తుంటారు. సోమవారం నెల్లూరు నుంచి బిట్రగుంట – చెన్నై మెమో రైలులో గూడూరుకు వచ్చారు. మూడో నంబరు ఫ్లాట్‌పాంపై ఆగేందుకు రైలు నెమ్మదిగా వెళ్తుండగా కృష్ణప్రసాద్‌ కిందకు దిగబోయాడు. ఆ సమయంలో కాలుజారి రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైల్వే జీఆర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతి కారణంగా కుటుంబం, బంధువులు, ఉపాధ్యాయ శ్రేణులు శోకసముద్రంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *