8వ తరగతి కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి గుంతకల్లు (ఏప్రిల్ 03) అనంతపురం జిల్లా గుంతకల్లు కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతున్న కావ్య శ్రీ అనే విద్యార్థిని బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సిబ్బంది వెంటనే గమనించి ఆ విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణపాయం తప్పింది. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉంది. స్థానిక ఎంఈఓలు, కేజీబీవీ సిబ్బంది ఆస్పత్రిలోనే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. దీనిపైన డీఈవో, ఏపీసి జీసీడీవోతో విచారణ చేయిస్తున్నారు. విచారణ లో కేజీబిఓ పీఈటీ కొట్టడంతో విద్యార్థిని మనస్తాపం చెంది ఆత్మాహత్యాయత్నం చేసుకుందని నివేదిక రావడంతో పిఈటీ అనితను శాశ్వతంగా విధులులు నుంచి తొలిగించామని అనంతపురం డిఇఓ బి.వరలక్ష్మీ, కేజీబివి ల ఏపీసి వరప్రసాద రావు తెలిపారు.