December 2, 2024

BHIM NEWS

Telugu News Channel

కోవూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డిని గెలిపించండి: తన్నీరు మధుబాబు

1 min read

oppo_0

భీమ్ న్యూస్ ఇందుకూరుపేట ప్రతినిధి (ఏప్రిల్ 03) బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట పంచాయతీలో తెలుగుదేశంపార్టీ, జనసేనపార్టీ, భారతీయ జనతాపార్టీ ల కూటమి శ్రేణులు ఇంటింటికీ తిరిగి బాబు సూపర్ 6 (ఆరు పథకాల) గురించి ప్రజలకు చెప్పి కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ టీడీపీ నాయకులు తన్నీరు మధుబాబు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వల్ల కోవూరు నియోజకవర్గంలో మామూళ్లు పర్వం మితిమీరి గుండాయిజం రాజ్య మేలుతున్నదని, ఈ అరాచకపు వైసీపీకి చరమగీతం పాడి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పట్రా చినబాబు, దామర్ల వెంకటేశ్వర్లు, ముసునూరు రవీంద్ర బాబు, ఇందుకూరుపేట మండలం బీజేపీ ఉపాధ్యక్షుడు నెల్లూరు శ్రీనివాసులుతో పాటు అధిక సంఖ్యలో కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *