April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

మా డిమాండ్లను పరిష్కరించండి: ఎమ్మార్పీఎస్ నాయకుల ఆందోళన

1 min read

 

. భీమ్ న్యూస్ ప్రతినిధి గూడూరు (ఏప్రిల్ 03) ఎస్సీ  వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాటాల్లో సుమారు 15 మంది మాదిగలు ప్రాణాలు కోల్పోయారని వేలాది కుటుంబాలు దెబ్బతిన్నాయని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదోని రత్నం తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరు రత్నం మాట్లాడుతూ రాజకీయ పార్టీలు మాదిగలను రాజకీయంగా వాడుకొని వారి డిమాండ్లను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *