April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

రాత్రికి రాత్రే వెలుస్తున్న అక్రమ లేఔట్ లు

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్ళకూరు (ఏప్రిల్ 03) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని తాల్వాయిపాడు గ్రామం సర్వేనెంబర్ 68 లో స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతంలో రాత్రికి రాత్రి ముస్తాబైన మూడవ అక్రమ లే అవుట్, గత కొన్ని నెలలుగా ప్రహరీ గోడ నిర్మాణం, మట్టి లెవెలింగ్ జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదనీ గ్రామ ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని తమ వెంచర్లు నందు కలుపుకొని ఒక్కో అంకణం లక్షల్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది. తాల్వాయిపాడు గ్రామ ప్రజలు పలుమార్లు ఈ అక్రమ లేఔట్ ల విషయం ప్రభుత్వ భూముల ఆక్రమణ పై తిరుపతి జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రము ద్వారా తెలియజేసినప్పటికీ మండల స్థాయి రెవిన్యూ ఉద్యోగులు పట్టించుకోకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తాల్వాయిపాడు నందు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొవడ మే కాకుండా, గ్రామ పంచాయతీకి రావలసిన పది శాతం  భూమిని ఇవ్వకుండా, అక్రమాలకు అడ్డాగా మారుతున్న ఈ రియల్ ఎస్టేట్ దందాను సంబంధిత అధికారులు అడ్డుకుంటారా.? వారికి అండగా ఉంటారా.? అనేది వేచి చూడాలి మరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *