December 2, 2024

BHIM NEWS

Telugu News Channel

ఐదేళ్లలో ఒక్కసారి చికెన్‌ ఇవ్వడం తప్ప.. ఎమ్మెల్యే చేసిందేమీ లేదు: ముస్లిం సోదరులు నిరసన

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాళహస్తి (ఏప్రిల్ 03) కరోనా సమయంలో ఓ పూట కూరకు సాయం చేశారని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అంత మాత్రానికే దానకర్ణుడిలా బిల్డపివ్వడం మొదలుపెట్టారని, దొరికిన ప్రతి వేదికపై మైక్‌ పట్టుకొని సొంత డబ్బాను కొట్టుకోసాగారని, అది విని సాయం పొందిన వాళ్లూ విసిగిపోయారు. చివరికి ఆ గప్పాలు ఆపండి బాబాయ్‌ అంటూ నిరసన తెలియజేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కరోనా సమయంలో ఓ రోజు ముస్లింలకు చికెన్‌, టమాటాలు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి ప్రచారానికి వాడుకుంటున్నారు. దీన్ని సాయం స్వీకరించిన ముస్లింలు అవమానకరంగా భావించి, మంగళవారం శ్రీకాళహస్తిలోని కుమారస్వామి తిప్ప కూడలి వద్ద నిరసన చేపట్టారు. ఒక్క రోజు సాయం చేసి రాజకీయ వేదికలపై తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా రోజూ చెప్పడం తగదన్నారు. ఐదేళ్లలో ఒక్కసారి చికెన్‌ ఇవ్వడం తప్ప ఎమ్మెల్యే చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. అయినా ఆపద వచ్చినప్పుడు సాయం చేయడం ఎమ్మెల్యే బాధ్యత  కాదా అని ప్రశ్నించారు. తమ వెంట తెచ్చుకున్న మాంసం, టమాటాను చెత్తకుప్పల్లో పడేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *