ఏపీలో తీవ్ర వడగాలుల ప్రమాదం: విపత్తుల సంస్థ
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి విజయవాడ (ఏప్రిల్ 04) ఏపీలో వడగాలులు వీచే అవకాశం ఉంది. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలో 130 మండలాల్లో వడగాలులు, ఎల్లుండి 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు వడగాల్పులు వీచే మండలాలు (130): శ్రీకాకుళంలో 4 , విజయనగరం 19, పార్వతీపురంమన్యం 12, అల్లూరిసీతారామరాజు 4, అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు 6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ 20.