April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఇసుక తవ్వకాల గుంటలో పడి మహిళ మృతి

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (ఏప్రిల్ 04) తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని మూర్తిరెడ్డిపాలెం సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో బుధవారం అర్ధరాత్రి మహిళ మృత దేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మిట్టపాలెం గ్రామానికి చెందిన కయ్యాల మీరమ్మ పశువుల తోలుకొని వెళ్లే క్రమంలో ఇసుక కోసం తవ్విన గుంతల్లో పడి మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *