దండిగుంట పంచాయతీలో అధికారులకు ఘన సన్మానం
1 min read
భీమ్ న్యూస్ ప్రతినిధి విడవలూరు (అక్టోబర్ 30) నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట పంచాయతీలో గ్రామ రెవిన్యూ అధికారిగా సుబ్బయ్య, పంచాయతీ కార్యదర్శిగా శ్రీనివాసులు పనిచేసి బదిలీ అయిన సందర్భంగా, అలాగే బదిలీలో భాగంగా పంచాయతీ కార్యదర్శిగా సుమంత్ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో దండిగుంట పంచాయతీ నాయకులు, పంచాయతీ కార్యాలయంలో అధికారులు ముగ్గురిని శాలువాలు కప్పి, పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెల్లంకొండ శ్రీధర్ నాయుడు మాజీ మండల ఎస్.సి. సెల్ నాయకులు కాగుల్లు చిన్న మస్తానయ్య, అన్నం రామచంద్రయ్య, ఎస్. రవి, సూరిబాబు, రమణయ్య, అంగన్వాడి శిరీష, వాణి, ఈ.ఓ.ఏ. పద్మ, వెంకట్, రాజా, వినయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.