November 14, 2024

BHIM NEWS

Telugu News Channel

ఒక మనిషి కేవలం 2 లీటర్లు మద్యం మాత్రమే క్యారీ ..?

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ (అక్టోబర్ 30) రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం  ముఖ్యమైనది.  లిక్కర్ నుంచే ఎక్కువగా ఆదాయం  వస్తుంది. అందుకే ఇప్పటికీ చాలా రాష్ట్రాలు తమ ఆదాయాలకు                    అనుగుణంగా ఎక్సైజ్   పాలసీలను రూపొందించుకుంటుంటాయి. దేశంలో ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జరుపుతున్నారు అంఘదుకే పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమంగా తరలించటం, బ్లాక్ మార్కెటింగ్ చేయటం వంటి వాటిని నిరోధిస్తుంటాయి. పోలీసుల కళ్లుగప్పి మద్యం బాటిళ్లు తరలించేవారిపై గట్టి నిఘా పెడుతుంటాయి.

ముఖ్యంగా గమనిస్తే దేశంలోని కొన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పన్నులు తక్కువగా ఉండటం వల్ల అక్కడి తక్కువ రేట్లకే మద్యం లభిస్తుంటుంది. కొందరు అక్రమార్కులు అక్కడి నుంచి రవాణా చేసి ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ రేట్లకు అమ్ముకుంటుంటారు. ఇక్కడ టాక్సుల వల్ల తగ్గిన మార్జిన్ వారికి అధిక రాబడిని తెచ్చిపెడుతుంది. ఇది సదరు రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతుంది కాబట్టి నేరంగా పరిగణించబడుతుంది. ఈ క్రమంలో సహజం అందిరికీ ఉండే అనుమానం బస్సులు, రైళ్లు లేదా ఇతర మార్గాల్లో ఎంత వరకు లిక్కర్ తీసుకెళ్లొచ్చు అన్నదే. బోర్డరు వద్ద అధికారులు సహజంగా చెక్ చేస్తుంటారు కాబట్టి బ్యాగ్గులో మద్యం బాటిళ్లను తీసుకెళ్లటం ఎంత వరకు అనుమతించబడుతుందనే అనుమానం సహజంగానే చాలా మందిలో ఉంటుంది.

అయితే మద్యం విక్రయాలతో పాటు తాగటంపై ఎలాంటి నిషేధం లేని రాష్ట్రాలకు మాత్రమే బస్సులే వెళ్లేటప్పుడు పరిమిత స్థాయిలో లిక్కర్ తీసుకెళ్లటం అనుమతించబడుతుంది. ముందుగా దేశంలో మద్యం అమ్మకాలు నిషేధంలో ఉన్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్, నాగాలాండ్, బీహార్, మిజోరాం ఉన్నాయి. ఇక లిక్కర్ చట్టప్రకారం అనుమతించబడే రాష్ట్రాల్లో ఒక మనిషి కేవలం 2 లీటర్లు మాత్రమే తనతో పాటు క్యారీ చేసేందుకు వీలు ఉంటుంది. ఈ పరిమితిని మించినప్పుడు రూ.5000 జరిమానాతో పాటు కొన్ని సార్లు గరిష్ఠంగా 5 ఏళ్ల వరకు శిక్ష విధించబడుతుందని గుర్తుంచుకోవాలి. దీనికోసం బస్సు ఆపరేటర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తప్పనిసరిగా సదరు లిక్కర్ బాటిళ్లకు సంబంధించిన బిల్లు కూడా క్యారీ చేయటం మంచిది.

ప్రస్తుతం గణాంకాల ప్రకారం దేశంలో ఒక్కో వ్యక్తి సగటున 5.7 లీటర్ల మేర మద్యం తాగుతున్నట్లు తెలుస్తోంది. అధికంగా మద్యం తాగుతున్న ప్రాంతాల్లో అరుణాచల్‌ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ పురుషులు మద్యం తాగేవారి సంఖ్య 52.6 శాతంగా ఉంది. ఇక తెలుగు రాష్టాల్లో తెలంగాణలో 43.4 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది. దీంతో గతంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు బదులుగా ప్రైవేటు వ్యక్తులకు షాపులను లాటరీ విధానంలో అందించింది. అలాగే ఎన్నికల్లో మాటిచ్చినట్లుగానే క్వార్టర్ మద్యాన్ని రూ.99కే విక్రయాలను ప్రారంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *