ఆక్రమణలో ఖాళీ స్థలాలు
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (అక్టోబర్ 31) తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ పరిధిలోని ఎల్ఐసి కార్యాలయం సమీపంలోని రహదారిపై గురువారం ఆక్రమణల పర్వం మళ్లీ మొదలైంది. రహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కంటైనర్ బాక్సులు నందు దుకాణాలు ఏర్పాటు చేసి వేల రూపాయలకు బాడుగులకు ఇస్తున్నారు . ఇటీవల రహదారి పక్కనే ఉన్న కంటెయిన్ ను ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారులు తొలగింపు చేపట్టారు. అయినా మళ్లీ యధావిధిగా కంటైనర్ దుకాణాలు పెడుతున్నారని స్థానికులు మీడియా ముఖంగా ఆందోళన చెందుతున్నారు