November 14, 2024

BHIM NEWS

Telugu News Channel

మృతదేహాం వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు.

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి సత్యవేడు  (అక్టోబర్ 31) తిరుపతి జిల్లా సత్యవేడు మండలం లో  తమిళనాడు ఊతుకోటకు చెందిన ధనశేఖర్ కుమారుడు దినేశ్‌  2 నెలల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు ధనశేఖర్ ఊతుకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సత్యవేడు మండలం దాసుకుప్పం పంచాయతీ చెన్నేరి వద్ద మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనపై సత్యవేడు సీఐ మురళి, ఊతుకోట డీఎస్పీ శాంతి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ వైద్యులు, తహశీల్దార్ సుబ్రహ్మణ్యం తదితర అధికారుల సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *