భీమ్ న్యూస్ ప్రతినిధి తడ (నవంబర్ 01) ఏపీ లో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వమని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా తెలిపారు. దీపం -2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ల పంపిణీతో సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం రామాపురం గ్రామం నుండి దీపం -2 ఉచిత గ్యాస్ పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతుంది. శుక్రవారం కలెక్టర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Leave a Reply