భీమ్ న్యూస్ ప్రతినిధి వడమాలపేట (నవంబర్ 02) మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు పట్ల కామాంధులు తీవ్రమైన చేష్టలతో, ఆలోచనలతో దుర్మార్గులు పేట్రేగిపోతున్నారు. అభంశుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారిని ఓ దుర్మార్గుడు కర్కశంగా చిదిమేసి ఆపై చంపి పూర్తి పెట్టాడు. అప్పటిదాకా నవ్వుతూ ఆడుకుంటున్న ఆ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేశాడు.
ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా వడమాటపేట మండలంలోని ఏ ఎం పురం (అబ్బి కండ్రిగ) గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుశాంత్(22) తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణంలో తినుబండారాలు కొనిచ్చి సమీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం బాలికను చంపేసి పూడ్చి పెట్టాడు. రాత్రి బాగా పొద్దుపోయినా పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వడమాలపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అనుమానితుడు సుశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Leave a Reply