భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (నవంబర్ 03) ఏపీలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు (నవంబరు 4) టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో గత నెల 3వ తేదీ నుంచి 21 వరకు ఆన్ లైన్ విధానంలో టెట్ నిర్వహించగా… 3.68 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. టెట్ ఫలితాల విడుదల వాస్తవానికి నవంబరు 2నే జరగాల్సి ఉండగా… నవంబరు 4కి వాయిదా వేశారు. మంత్రి నారా లోకేశ్ కూడా అమెరికా పర్యటన ముగించుకుని రావడంతో, రేపు ఆయన చేతుల మీదుగానే ఫలితాలు విడుదల చేయనున్నారు.
Leave a Reply