భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (నవంబర్ ౦౩) తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో నేరాల నియంత్రణపై,మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధంగా నాయుడుపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నాయుడుపేట డిఎస్పి చెంచు బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరులోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఆదివారం డిఎస్పి చెంచు బాబు ఆధ్వర్యంలో నాయుడుపేట అర్బన్ సిఐ బాబి పోలీసు సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.అనంతరం ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో ప్రతి వీధిలో పర్యటించి వాహనాలను తనిఖీలు చేసి,వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పి చెంచు బాబు మాట్లాడుతూ పోరుగు రాష్ట్రాల నుండి సుమారు 500 మంది మేనకూరు సెజ్ కంపెనీలో పనిచేస్తున్నారని వారంతా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్,మధ్యప్రదేశ్ సంబంధించిన యువకలు అని తెలిపారు.ఎక్కువగా మత్తు పదార్థాలకు గంజాయి లాంటి విన్యాసాలకు దగ్గర అయ్యి తమ భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారని, అలాంటి వాటికి యువకులు దూరంగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా ఈ యొక్క కార్డెన్ సెర్చ్ లో గంజాయి, నెంబర్ లేని వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని పలు ప్రాంతాల్లో యువకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కంపెనీలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు గాని ఏదైనా సమస్యలకు దారితీస్తే మేనకూరు ప్రాంతవాసులు నాయుడుపేట పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలియజేశారు. ఈ కార్డెన్ సెర్చ్ లో నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారి సత్రం, ఓజిలి, ఎస్ఐలు, శ్రీహరి, నాగరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Leave a Reply