భీమ్ న్యూస్ ప్రతినిధి విజయనగరం (నవంబర్ 03) విజయనగరంలోని కాటవీధిలో ఉన్న బిసి వసతిగృహంలో ఏడో తరగతి చదువుతున్న చదువుతున్న విద్యార్థి కొణతాల శ్యామలరావు(12) మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం ఉదయం టిఫిన్ చేసిన అనంతరం అరగంట వ్యవధిలోనే విద్యార్థి మరణించాడు. ఏమీ జరగకపోతే ఆరోగ్యంగా ఉన్న తమ బిడ్డ ఎలా మరణించాడని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వసతిగృహంలో సంక్షేమ అధికారి, సిబ్బంది నిర్లక్ష్యమా? లేదా వైద్యులు అనుమానిస్తున్నట్లు గుండెపోటుతో మరణించాడా? లేక మరే ఇతర కారణమా? అనేది తేలాల్సి ఉంది. ఇదే విషయంపై కుటుంబ సభ్యులతోపాటు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కూడా సందేహం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతదేహం, కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. దీంతో ఏమైనా పచ్చకామెర్ల ఉన్నాయా? అని అనుమానం వ్యక్తమవుతోంది. ‘సరదాగా ఉన్నాడు. టిఫిన్ చేసిన అనంతరం ఉన్నఫళానా నీరసంగా ఉందని చెబితే సఫర్యాలు చేశామని నీరు అడిగాడు. ఇచ్చినా తాగాలేదు’ అని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
పక్కనే ప్రయివేటు ఆస్పత్రి ఉన్నా ..? :
కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థిని.. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. దీంతో వసతిగృహం పక్కనే ఉన్న ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేవాడని విద్యార్థి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వార్డెన్, సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారు.
పోస్టుమార్టం నివేదిక :
ఆస్పత్రికి వచ్చేటప్పటికే విద్యార్థి మరణించినట్లు జిల్లా సర్వజన ఆస్పత్రి వైద్యులు కూడా చెప్పారు. అంతే తప్ప ఏ కారణంతో మరణించాడనేది చెప్పలేకపోయారు. విద్యార్థి మృతిపై బిసి, ఇడబ్ల్యుఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి ఎస్.సవిత స్పందించారు. విద్యార్థి మరణంపై విచారం వ్యక్తంచేసిన మంత్రి… మృతిపై పూర్తి వివరాలను తక్షణమే అందజేయాలని బిసి సంక్షేమ శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు కూడా 24 గంటల్లో నివేదిక అందించాలని చెప్పారు. విద్యార్థి మృతదేహానికి రెండో పట్టణ పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిం చారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే విద్యార్థి మరణం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.
వార్డెన్ నిర్లక్ష్యమే :
వసతిగృహ విద్యార్థి శ్యామలరావు మరణానికి వార్డెన్ జానకిరాం నిర్లక్ష్యమే కారణమంటూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము, సిహెచ్ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వార్డెన్ జానకిరాం గతంలో కూడా అనేక సార్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని చెబుతు న్నారు. హాస్టల్‌కు ఎన్నో సార్లు గైర్హాజ రవుతూ విద్యార్థులను పట్టించుకునే వారు కాదని మండిపడ్డారు. వార్డెన్‌పై నమ్మకం తోనే తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో చేర్పిస్తారని, అలాంటి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్, సిబ్బందిని సస్పెండ్ చేయాలని, విద్యార్థి కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు వసతిగృహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిరసన పెద్ద ఎత్తున చేపట్టారు.
Leave a Reply