భీమ్ న్యూస్ ప్రతినిధి విశాఖపట్నం (నవంబర్ 03) ఏపీ సీఎం చంద్రబాబుపై తరచూ విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీ వైసీపీ సోషల్ మీడియా తాజాగా ప్రశంసలు కురిపిస్తోంది. థాంక్యూ చంద్రబాబు అంటూ వైసీపీ శ్రేణులు వరుస పోస్టులు పెడుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే బాబుపై వైసీపీ మీడియా ప్రశంసలు కురిపించడానికి ఓ కారణం కూడా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో హంగులతో రుషికొండ ప్యాలెస్ నిర్మించిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విలాసవంతంగా ఉండేందుకు, తన సతీమణి కోసమే కొండను తవ్వి మరీ రుషికొండ ప్యాలెస్ నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఏపీలో ప్రభుత్వం మారి టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆ ప్యాలెన్ ను ఏం చేయాలనే ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు శనివారం పార్టీ నేతలు, కొందరు అధికారులతో కలిసి రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుషికొండ ప్యాలెస్ ను వరల్డ్ క్లాస్లో నిర్మించారని అన్నారు. ఇదే పాయింట్ పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రశంసించారని, జగన్ పనితీరును మెచ్చుకున్నారని థాంక్యూ చెబుతోంది. కానీ చంద్రబాబు స్పీచ్ మొత్తం అందుకు విరుద్దంగానే ఉంది.
ప్యాలెస్ నిర్మాణంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రపంచంలో చాలా దేశాలు తిరిగినా ఎక్కడా ఇలాంటి కాస్ట్లీ ప్యాలెస్ చూడలేదని చెప్పారు. ఎవరూ కలలో కూడా ఊహించనిదని, ఒక వ్యక్తి తన విలాసవంతమైన జీవితం కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేస్తాడనేది ఇక్కడి భవనాలు చూసిన తరవాతనే తెలిసిందన్నారు. కేవలం బాత్ టబ్ కోసమే రూ.36 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ఫ్యాన్సీ ఫ్యాన్లు పెట్టారని ఇలాంటి షాండియర్లు తాను ఎక్కడా చూడలేదని అన్నారు. ఈ భవనాలు అందరికీ చూపిస్తామని, వీటిని వేటికి వాడుకోవాలో అర్థం కావడం లేదని అన్నారు. పేదలను ఆదుకుంటామనేవారు ఇలాంటివి కట్టుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ యోచన :
ఈ పరిస్థితుల్లో ఋషికొండ ప్యాలెస్ ను ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఉపయోగించే ఆలోచనలు ప్రభుత్వం చేస్తున్నదని తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యమైన రంగంగా ఉన్నటువంటి సినిమా పరిశ్రమకు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం పడింది. అంతేకాకుండా టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో టూరిజం రంగానికి కేటాయించాలని ఆలోచిస్తుంది. ఇంకో ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రముఖులైన వ్యక్తులకు విడిద కేంద్రంగా ఏర్పాటు చేయాలని మరో ఆలోచనతో ఉంది. వరల్డ్ క్లాస్ నిర్మాణం అయినందున ప్రముఖ విదేశీ కంపెనీలకు కేటాయించాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించి కార్యాలయాలకు కూడా కేటాయించే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సినిమా పరిశ్రమ రంగానికి లేదా టూరిజం రంగానికి కేటాయించాలనే ఆలోచనలో కచ్చితంగా ఉందని మరికొందరి వాదన.
రాష్ట్రంలో టూరిజం రంగం అభివృద్ధి :
ఋషికొండ ప్యాలెస్ ను టూరిజం రంగానికి కేటాయిస్తే విదేశీయులు స్వదేశీయులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో టూరిజం రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చని, సామాన్య జనానికి కూడా ఋషికొండ ప్యాలెస్ అందుబాటులోకి ఉంచడం వల్ల రాష్ట్రానికి ఆదాయం మరింత పెరుగుతుదని ప్రభుత్వ పెద్దలతో పాటు, సామాన్య జనం కూడా సమాలోచనలు చేస్తున్నారని మరికొందరి వాదన… వేచి చూడాల్సిందే మరి..!
Leave a Reply