భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (నవంబర్ 05) పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ దృష్టికి పలు సమస్యలు గురించి ఎం.పీ. డా. మద్దిల గురుమూర్తి నివేదించారు. కోవిడ్ సమయంలో నిలిచిన రైళ్లను పునరుద్ధరించడంతో పాటు కొత్త రైళ్లను తిప్పాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కోరారు. పలు రైల్వే అభివృద్ధి పనులు, వాటిపై అధ్యయనం చేసేందుకు తిరుపతికి వచ్చిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బృందాన్ని ఎంపీ గురుమూర్తి సోమవారం కలిశారు. తిరుపతి తాజ్ హోటల్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎంపీ పలు ప్రతిపాదనలు కమిటీ ముందుంచారు.
కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుకు వినతి :
తిరుపతి – కాట్పాడి, తిరుపతి – గూడూరు, తిరుపతి నుండి ధర్మవరం, తిరుపతి – యర్రగుంట్ల, తిరుపతి – శ్రీకాళహస్తి నడికుడి మార్గాలను పరిధిగా చేసుకొని తిరుపతి కేంద్రంగా కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనీ ఎంపీ కోరారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం మాత్రమే కాకుండా ప్రముఖ విద్యాసంస్థలకు, పలు పారిశ్రామిక వాడలకు కేంద్రగా ఉందని ఈ జోన్ ఏర్పాటుతో సరకు రవాణా, ప్రయాణికుల రవాణా మెరుగుపడి వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి ఈ రైల్వే జోన్ తోడ్పడుతుందని ఎంపీ అన్నారు.
వందేభారత్ రైళ్ళ సేవలకు వినతి :
తిరుపతి, రేణిగుంట మీదుగా నెల్లూరు-మైసూర్ మార్గంలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ నడపాలి. ఈ రైళ్లను ప్రవేశ పెట్టడం వల్ల భక్తులు, పర్యాటకులకు ఎంతో ప్రయోజనం వుంటుందని ఎంపీ తెలిపారు. తిరుపతి – విశాఖపట్నం మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశ పెడితే వివిధ వర్గాల ప్రయాణికులకు ఎంతో లాభమని ఎంపీ తెలిపారు. కీలకమైన ఈ మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశ పెట్టాలనే డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు.
కొత్త రైళ్ల సేవలు :
తిరుపతి – బ్రహ్మపూర్; తిరుపతి – వారణాసి , అయోధ్య; తిరుపతి – షిర్డీ (ప్రతిరోజూ); నెల్లూరు – తిరువణ్ణామలై (తిరుపతి & చిత్తూరు) రైళ్లను ప్రవేశ పెట్టాలని ఎంపీ గురుమూర్తి ప్రతిపాదించారు. అలాగే కొత్త మెమో రైళ్లు తిరుపతి నుంచి నెల్లూరు; తిరుపతి – కడప మార్గాల మధ్య ప్రవేశ పెట్టాలని కోరారు.
ఇప్పటికే ఉన్న రైళ్ల పొడిగింపు, షెడ్యూళ్లకు మార్పులు :
-ప్రస్తుతం చిత్తూరు వరకు నడుస్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12798) కుప్పం వరకు పొడిగించాలి.-సికింద్రాబాద్ నుంచి గూడూరు మధ్య నడుస్తున్న సింహపురి ఎక్స్‌ప్రెస్ (12710) తిరుపతి వరకు పొడిగించాలి. ,తిరుపతి – సికింద్రాబాద్ మధ్య వారంలో అయిదు రోజులు మాత్రమే నడుస్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్ (12763)ని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతిరోజూ నడపాలి., పాకాల, ధర్మవరం, గుంతకల్ మీదుగా వారానికి రెండు రోజులు నడుస్తున్న తిరుపతి-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12731)ని ప్రతి రోజూ నడపాలి., తిరుపతి – రామేశ్వరం మధ్య వారంలో 3 రోజులు నడుస్తున్న మీనాక్షి ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజూ నడపాలి.-, తిరుపతి -బెంగళూరు మధ్య వారంలో 3 రోజులు నడుస్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ నడపాలి., తిరుపతి – కోయంబత్తూరు మధ్య వారంలో 4 రోజులు నడుస్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ నడపాలి., తిరుపతి – షిర్డీ వారానికి ఒక రోజు మాత్రమే నడుస్తున్న రైలుని ప్రతి రోజూ నడపాలి.
రైళ్లను ఆపడానికి అభ్యర్థన :
-వెందోడు రైల్వే స్టేషన్లో రైలు నంబర్లు 17405/17406 కృష్ణా ఎక్స్‌ప్రెస్, 17480/17489 తిరుపతి – పూరి – తిరుపతి ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లను ఆపాలి.దక్షిణ రైల్వే జోన్ పరిధిలోని నాయుడుపేట, సూళ్లూరుపేట స్టేషన్లలో చెన్నై ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 12604), నవజీవన్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్లు 12655/56), కాకినాడ పోర్ట్-చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 17644) నిలుపుదల కోసం అభ్యర్ధించడం జరిగింది. చెన్నై నుంచి సూళ్లూరుపేట వరకు నడుస్తున్న మెమూ రైళ్లను నాయుడుపేట వరకు పొడిగించవలసినదిగా కోరారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి. :
రేణిగుంట నుంచి గూడూరు, తిరుపతి నుండి రేణిగుంట మధ్య 3వ లైన్ అభివృద్ధి ఎంతో అవసరం. ఈ మార్గంలో ప్రయాణికులు రద్దీ ఎక్కువగా వుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య రైళ్లు ఎక్కువగా నడపబడుతున్నందున, మూడవ లైన్ సులభతరమైన కార్యకలాపాలను అనుమతిస్తుంది, నిరీక్షణ సమయం, ఆలస్యాన్ని తగ్గిస్తుంది, రేణిగుంట రైల్వే స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేయాలి.
గూడూరులోని అంబేద్కర్ నగర్ సమీపంలో I, II పట్టణాలను కలిపే అండర్‌పాస్ వెంకటగిరి, రాజంపేట, రాపూరు, పొదలకూరు వంటి పట్టణాలకు ప్రయాణించేందుకు ప్రధాన మార్గంగా ఉంది. ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నందువలన ఇరుకుగా ఉన్న ఈ అండర్‌పాస్‌ను సాఫీగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారికీ తెలియజేసారు. అలాగే తిరుపతి – కాట్పాడి మార్గాన్ని డబల్ లైన్ చెయాలనీ ప్రతిపదించడం జరిగింది.
రేణిగుంట రైల్వే స్టేషన్ తిరుపతికి సేవలందించే ఒక ప్రధాన జంక్షన్, రేణిగుంట స్టేషన్‌కి “తిరుపతి ఈస్ట్” స్టేషన్‌గా పేరు మార్చడం, తిరుచానూరు స్టేషన్‌ను తిరుపతి సెంట్రల్గా మార్పునకు . ఈ పేరు మార్పు ప్రయాణికులకు మెరుగైన స్పష్టతను అందించడానికి, తిరుపతి నగరానికి సేవలు అందించే కీలక స్టేషన్‌గా మారుతుందని స్టాండింగ్ కమిటీ దృష్టికి తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీసుకెళ్లారని ఈ సందర్భంగా తెలిపారు.
Leave a Reply