భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (నవంబర్ 06) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని కానూరు రాజుపాలెం, తాళ్వాయిపాడు గ్రామాల్లో బుధవారం మండల వ్యవసాయ అధికారి ప్రవీణ ఆధ్వర్యంలో ఉద్యానవన శాఖ అధికారి శారద వారి సిబ్బంది ద్వారా నిమ్మసాగు – మెళకువలు, రెమ్మ కత్తిరింపులు, తెగుళ్లు, వాటి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త నాగార్జున రెడ్డి వరిలో రకాలు ఎంపిక, మిరప, నిమ్మ సాగులో అధిక దిగుబడులపై రైతులకు ప్రత్యేకమైన అవగాహన కలుగజేశారు, వర్షాకాలం, శీతాకాలంలో మిరప నిమ్మ, వరి పంటల్లో దిగుబడి సాధించాలంటే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాయిల్ సైంటిస్ట్ రాజీవన్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, క్లస్టర్ ఆఫీసర్ నరేష్, పశువర్ధక శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
Leave a Reply