భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాళహస్తి (నవంబర్ 06) ఏపీలో వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈనెల 3 తేదీనుంచి 7 వరకు జరిగిన స్కూల్ గేమ్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుండి విద్యార్థినిలు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి విద్యార్థిని చైతన్యశ్రీ విజయవాడలోని బన్సాల్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ టెన్నిస్ క్రీడలో రాణిస్తూ పోటీల్లో పాల్గొంది. ఈ సందర్భంగా అండర్ – 17 బాలికల సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో పాల్గొని విజయం సాధించి, ఛాంపియన్షిప్ కప్ ను కైవసం చేసుకుంది. ఈ పోటీలో విజయం సాధించిన చైతన్యశ్రీని వివిధ జిల్లాల డీఈవోలు అభినందిస్తూ కప్ ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు, అధ్యాపకులు, బంధువులు స్నేహితులు, బంధువులు విజయం సాధించిన విద్యార్థి చైతన్య శ్రీ కి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కోచ్ ముని కృష్ణారెడ్డి మార్గదర్శకంలో పలు జిల్లా, రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడలో రాణిస్తూ విజయం వైపు పయనిస్తున్న చైతన్య శ్రీ జాతీయస్థాయిలో ఇదే స్ఫూర్తితో గెలుపొందాలని కోరుకుంటున్నారు.
Leave a Reply