భీమ్ న్యూస్ ప్రతినిధి రాయవరం (నవంబర్ 07) జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా సర్వసిద్ది పి.హెచ్.సీ వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీ అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.ఎస్.వి. కె.బాలాజీ ఆదేశాలు మేరకు పి.హెచ్. సీ వద్ద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మరియు ఉప్పరపల్లి ఫ్యామిలీ డాక్టర్ క్లినిక్ వద్ద డాక్టర్ ఎన్ వాసంతి పర్యవేక్షణలో నిర్వహించిన అవగాహన ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పొగాకు ఉత్పత్తులు వాడటం వలన, ఊబకాయం ,ఆహారపు అలవాట్లు సక్రమంగా పాటించక పోవటం వలన నోటి, లంగ్, పాంక్రియాస్, ప్రేగు, రొమ్ము, గర్భసంచి, ప్రొస్టేట్, లివర్, బ్రెయిన్, చర్మ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ లు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అలాగే పొగ త్రాగే అలవాటు, గుట్కా, పాన్ మసాలా నమిలే అలవాటు, మద్యం త్రాగే అలవాటు చెడు అలవాట్లు గలవారు వెంటనే నిలిపివేయాలని కోరారు.
ప్రజల్ని చైతన్య వంతులగా చేయాలని తద్వారా స్త్రీలలో అయితే గర్భసంచి క్యాన్సర్ ,రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయని, తెల్ల బట్ట ఎక్కువుగా అవుతూ వాసన రావటం, నెలసర్లు సరిగా రాకపోవటం, రక్త స్రావం ఎక్కువ అవ్వటం లక్షణాలుగా వుంటాయని తెలిపారు. అలాగే పురుషుల్లో మద్యం ను సేవించే అలవాటు ఉన్నవారికి పాంక్రియాస్, లివర్, ప్రేగు, ప్రొస్టేట్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయని అన్నారు. పీ .హెచ్. సీ వద్ద డాక్టర్ ఎస్.ఎస్.వి.శక్తి ప్రియ మరియు వుప్పరపల్లి లో డాక్టర్ ఎన్ వాసంతి సంయుక్తంగా అవగాహన కల్పించారు. తదుపరి ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు , పి.హెచ్.ఎన్…ఎం.రత్న సఖి సూచనలు తో నిర్వహించిన ర్యాలీలో హెల్త్ విజిటర్ వై.సూర్య కుమారి అలాగే ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు జి.కొండబాబు, ఎల్.వీణ వాహిని, డి.రామ లక్మి, కె.శ్రావణి, వై.అనుష ఆధ్వర్యంలో 1. మద్యం త్రాగోద్దు – క్యాన్సర్ కి బలి కావద్దు : 2. పొగాకు ఉత్పత్తులు వాడొద్దు – క్యాన్సర్ కి దరి చేరద్దు ; 3.ప్రాసెసింగ్ ఫుడ్ తినద్దు – క్యాన్సర్ కి గురి కావద్దు అనే నినాదాలతో నిర్వహించిన అవగాహన ర్యాలీ లను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆకలి తగ్గి పోవటం, వాంతులు తరుచుగా అవ్వటం, బరువు తగ్గటం, తీవ్రమైన కడుపు నొప్పి, విరోచనం తో పాటు రక్తం పడటం, తీవ్రమైన దగ్గు, రక్తపు జీర కనిపించటం వంటి లక్షణాలు వుంటే వెంటనే దగ్గర లోని ఆసుపత్రి కి వెళ్లి డాక్టర్ తో తనిఖీ చేయించుకొవాలన్నారు. అది క్యాన్సర్ లక్షణాలుగా అనుమానిస్తే మెడికల్ ఆఫీసర్ నిజనిర్ధారణ పరీక్షలు కొరకు క్యాన్సర్ ఆసుపత్రి కి రెఫర్ చేస్తారని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఎఫ్.డి.పి. క్లస్టర్ పర్యవేక్షకులు బి.ప్రేమ్ కుమార్, హెల్త్ సెక్రటరీ లు ఎం.రాజేశ్వరి, ఒ. వేణు,ఆశా, జి. బేబీ, పి. నూకరత్నం, జి.వరలక్ష్మి,ఆశా రత్నం, కె. విజయ, ఇతర ఆసుపత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Leave a Reply