భీమ్ న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ (నవంబర్ 10) నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 3.6 కి. మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.మరో 24 నుంచి 26 గంటల్లో ఉపరితల ఆవర్తనం పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు నెమ్మదిగా చేరుకోనుంది. నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణి ట్రోపో ఆవరణము వరకు విస్తరించి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఆదివారం రాత్రి, లేక సోమవారం అల్పపీడనం :
నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ఆదివారం రాత్రి, లేక సోమవారం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దాని ప్రభావంతో నవంబర్ 10 నుంచి 12 వరకు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మిగతా చోట్ల తేలికపాటి జల్లులకు అవకాశం ఉంది. ఆదివారం రోజు ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పారు. అయితే నవంబర్ 11, 12 తేదీలలో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుందని అంచనా వేశారు. సోమ, మంగళవారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత సురక్షితం కాదని.. తీరం వెంట గాలుల ప్రభావంపై ఇది ఆధారపడి ఉంటుంది.
Leave a Reply