December 2, 2024

BHIM NEWS

Telugu News Channel

సమ్మె కాలపు వేతనం విడుదలకు విద్యాశాఖామంత్రి నారా లోకేష్ అంగీకారం.

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (నవంబర్ 11) ఏపీ లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు  సోమవారం మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు.కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలతో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలోని ఉద్యోగులు గౌరవ వేతనం కోసం గత ప్రభుత్వం హయాంలో 21 రోజులు సమ్మె చేశారని ఆయన గుర్తుచేశారు. ఆ సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు విడుదల చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. సోమవారం ఆ ఉత్తర్వులు జారీ అయినట్లు చెప్పారు.

కాగా, సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గత ప్రభుత్వ హయాంలో 20 డిసెంబరు 2023 నుండి 10 జనవరి 2024 వరకు 21 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె కాలానికి సంబంధించిన వేతనం చెల్లించాల్సిందిగా ఇటీవల విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ని సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు కలిసి రిక్వెస్ట్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకున్న మంత్రి వేతనాలు విడుదల చేయడానికి అంగీకరించారు. దీంతో ఈ వేతనాలు సోమవారం విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *