మాజీ మంత్రి పరసాకు మాజీ ఎమ్మెల్సీ వాకాటి పరామర్శ.
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట ( నవంబర్ 11) తిరుపతి జిల్లాలో నాయుడుపేటలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ పరసారత్నం ను సోమవారం గొట్టిప్రోలు లోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి పరామర్శించారు. డాక్టర్ పరసారత్నం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకుని తన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న వాకాటి నారాయణరెడ్డి పరసారత్నం నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. పరసారత్నం పూర్తి ఆరోగ్యంగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని వాకాటి నారాయణరెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.