భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (నవంబర్ 12) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం జిల్లా ఉన్నత పాఠశాల మంగళంపాడు సీఆర్పి, జిల్లా సిఆర్పి యూనియన్, రాష్ట్ర నాయకుడు వేలూరు అంకయ్య (జై భీమ్ అంకన్న) ను మంగళవారం జిల్లా విద్యాశాఖలోని అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏ.ఎం.ఓ.) శివశంకర్ పరామర్శించారు. కాగా గత నెలలో జరిగిన యాక్సిడెంట్ లో కాలు విరిగి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నాయుడుపేటలోని తన తమ్ముని ఇంట్లో బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఏ.ఎం.ఓ శివ శంకర్ యాక్సిడెంట్ జరిగిన తీరును అంకయ్యను అడిగి తెలుసుకున్నారు. సి.ఆర్పి. అంకయ్య పట్ల సానుభూతిని తెలుపుతూ, త్వరగా కోలుకోవాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తరల్ కోఆర్డినేటర్ సుధీర్, టీచ్ టూల్ తిరుపతి కో- ఆర్డినేటర్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply