భీమ్ న్యూస్ ప్రతినిధి జాతీయం – లకన్ పూర్ (నవంబర్ 13) రోజు రోజుకూ నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అనేక రకాల మార్గాలను వెతుకుతున్నారు. కొందరు నేరస్థులు ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ రవాణాను సాగించడం చూస్తుంటాం.పోలీసుల తనిఖీల్లో ఇలాంటి షాకింగ్ ఘటనలు అనేకం వెలుగు చూస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయిల్ ట్యాంకర్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో చివరకు ప్రొక్లయిన్‌తో పగులగొట్టి చూడగా దిమ్మతిరిగే సీన్ కనిపించింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి ఓ ఆయిల్ ట్యాంకర్‌పై అనుమానం వస్తుంది. దీంతో చివరకు ఆ వాహనాన్ని రోడ్డు పక్కనే ఆపేశారు. తర్వాత ఓ ప్రొక్లయినర్‌ను రప్పించి, ఆయిల్ ట్యాంకర్‌ను తెరిచే ప్రయత్నం చేశారు. ప్రొక్లయినర్ తొండంతో ట్యాంకర్‌కు ఓ వైపు ఉన్న భాగాన్ని తొలగించారు.
ఇలా ట్యాంకర్ ఇనుప రేకు తొలగించి చూడగా లోపల షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆయిల్ ట్యాంకర్‌లో ఆయిల్‌కు బదులుగా ఆవులు కనిపించాయి. చాలా ఆవులను అందులో కుక్కేసి, అక్రమంగా కబేళాలాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇలా ఆయిల్ ట్యాంకర్‌లో ఆవులను చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అయితే ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కతువా జిల్లాలోని లకన్ పూర్ ప్రాంతంలో జరిగింది.కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ”వామ్మో.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదు”.. అంటూ కొందరు, ”ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి”.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లు, 9.70 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూ ఉండడం తో దేశంలో పశుసంపద తరిగిపోతోంది అనడానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వాలు ఓ పక్క పశువులను కాపాడాలి అంటూనే పశువులను తరలిస్తున్న వాహనాలను తనిఖీ చేయకపోవడం, కబేళాలకు పశువులను ఎక్కువగా తరలించడం మూలంగా దేశంలో పశుసంతతి నశిస్తూ ఉంది. పశుసంపద లేనప్పుడు, పాల ఉత్పత్తి తగ్గిపోతుంది . దాని మూలంగాపాలు, పాల ఉత్పత్తులు తగ్గిపోయి ప్రజలకు తీవ్రమైన శక్తి కొరత ఏర్పడి న్యూట్రిషన్ లోపాలతో అనారోగ్యం పాలవుతారనేదాన్ని దృష్టిలో ఉంచుకొని పశువులను కాపాడుకోవాలని, దేశంలో జనాభివృద్ధి లాగానే పశుగణాభివృద్ధిని పెంచాలని పశు వైద్య నిపుణులు వేనోళ్ల కోరుతున్నారు.
Leave a Reply