సినీ నటుడు పోసాని కృష్ణపై సూళ్లూరుపేట పీ.ఎస్. లో ఫిర్యాదు
1 min read
భీమ్ న్యూస్ ప్రతినిధి సూళ్లూరుపేట (నవంబర్ 14) సోషల్ మీడియా వేదికగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి టీవీ 5 చైర్మన్, ప్రస్తుత టీటీడీ పాలకమండలి చైర్మన్ బి.ఆర్. నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను సినీ రచయిత పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని బొజ్జ సుధాకర్ అనే వ్యక్తి సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సూళ్లూరుపేట ఎస్సై బ్రహ్మనాయుడు కేసును విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.