అదుపు తప్పిన కంటైనర్ లారీ – తృటిలో తప్పిన ప్రమాదం
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి సూళ్లూరుపేట (నవంబర్ 14) జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనానికి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహన దారుడిని కాపాడేందుకు మరో ద్విచక్ర వాహనదారుడు ప్రయత్నించాడు. హఠాత్తుగా ఇద్దరూ రోడ్డుపై ఆగడంతో వెనక వేగంగా వస్తున్న భారీ కంటైనర్ లారీ డ్రైవర్ వీరి ఇద్దరినీ కాపాడేందుకు అత్యవసర బ్రేకులు వేసి పక్కకు తిప్పడంతో కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడింది. లేదంటే రోడ్డుపై వున్న ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. వారి ప్రాణాలు కాపాడేందుకు కంటైనర్ డ్రైవర్, తన ప్రాణాల్ని లెక్క చేయని సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారిపై తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్.ఆర్. రెసిడెన్సీ సమీపంలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అదుపు తప్పి కింద పడిపోయాడు. అదే సమయంలో మరో వ్యక్తి అతనిని రక్షించేందుకు బైక్ ఆపి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చాడు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న భారీ కంటైనర్ వారి వెనుక నుంచి వస్తోంది. ఒక్క సారిగా రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు వుండడంతో కంటైనర్ డ్రైవర్ చాకచక్యంగా స్పందించి బండిని నిలిపే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో అతని కంటైనర్ సైతం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తృటిలో తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న సూళ్లూరుపేట పోలీసు సిబ్బంది, టోల్ ప్లాజా సిబ్బంది జెసిపి, క్రాన్ సహాయంతో కంటైనర్‌ను సరి చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తి, ధైర్యానికి అభినందనలు తెలిపారు.