వ్యవసాయ పొలాల్లో నేలకొరిగిన విద్యుత్ స్తంభం.
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (నవంబర్ 14) తిరుపతి జిల్లా మండల కేంద్రమైన పెళ్లకూరులో వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంబం ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ తీగలతో పాటు స్తంబం నేలకొరిగింది. ఈ విషయమై అక్కడ రైతులు గత 30 రోజులుగా విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అక్కడ అధికారులు స్పందించడం లేదని గ్రామంలోని రైతులు వాపోతున్నారు. గత 30 రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని, పైసలు ఇస్తేనే పడిపోయిన విద్యుత్ స్తంభం పైకి లేస్తుందేమో అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ మొదలై సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నేలకొరిగిన విద్యుత్ స్తంభం మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇక్కడ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేత కోసం పశువులు, గొర్రెలు జంతుజాలం, వ్యవసాయ పనులకు రైతులు తెలియకుండా ఆవైపుగా వెళితే ప్రాణం నష్టం కూడా సంభవిస్తుందని, విద్యుత్తు అపాయం నుంచి కాపాడాలని కోరారు. ఇటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండల స్థాయి అధికారుల తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు మీడియా ముఖంగా కోరుతున్నారు.