ఢిల్లీ మాజీ సీ.ఎం. కేజ్రీవాల్ కు ఘన స్వాగతం పలికిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు.
1 min read
భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి – రేణిగుంట (నవంబర్ 14) ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ , ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేశారు. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో నవంబరు 13 బుధవారం రాత్రి గం.7 లకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సీరా రమేష్ కుమార్, రాష్ట్ర ఇన్‌చార్జి మణి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్‌కే పటేం, జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటాచలపతి, రాష్ట్ర ట్రెజరర్ నూటి ఉదయ భాస్కర్, రాష్ట్ర మహిళా కన్వీనర్ డా. షీతల్ మదన్, రాష్ట్ర ఐటీ ఇన్‌చార్జి బివికె పవన్, రాష్ట్ర ప్రతినిధి కొడివాక చందు, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎమ్ నందిని తిరుపతి నియోజకవర్గ ఇంచార్జి బొంతల రాజేష్, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ 100 మంది కార్యకర్తలతో పాల్గొని, అరవింద్ కేజ్రివాల్ నాయకత్వం వర్ధిల్లాలని ప్లకార్డులతో నినాదాలు చేస్తూ, ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల కన్వీనర్లు పట్టపు రవి, మణి, రాజు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం పుంజుకునే విధంగా ప్రణాళికలో రూపొందిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటింగ్ విజయకేతనం ఎగరవేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఆయన కుటుంబంతో కలిసి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసి గురువారం ఉదయం శ్రీవారిని కేజ్రీవాల్ దర్శించుకోనున్నారు.