భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్ళకూరు (నవంబర్ 15) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెలుబల్లిలో గురువారం ప్రధానోపాధ్యాయులు డి కవిత ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఎం శంకరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు బావిభారత పౌరులుగా రాణించాలని, విద్యార్థులు విద్యతోపాటు సహ పాఠ్యాంశాలలో కూడా ముందుండాలని కోరారు. ఈనాడు విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి వారి ప్రతిభను వివిధ రంగాల్లో చూపడం జరుగుతుందని, ప్రభుత్వం కూడా విద్యార్థులను మంచి స్థాయిలో తీర్చిదిద్దేందుకు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. విద్యా సౌకర్యాలకు సంబంధించిగాని, పాఠశాలల్లో విద్యార్థులు తెలివితేటలును ఉపాధ్యాయుల ద్వారా బాగా అంది వస్తాయని, విద్యార్థుల ప్రతిభ పాటవాల స్థాయిని మెరుగుపరచుకోవడానికి ఇది ఒక సదావకాశమని తెలిపారు. ఆటలు, పాటలు, క్రీడలు తదితర అంశాలలో ముందుండాలని తద్వారా పాఠశాలకు గ్రామానికి, మండలానికి, రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు వస్తాయని కొనియాడారు. అనంతరం నేటి బాలలే రేపటి పౌరులుగా మార్చే ప్రయత్నం ఉపాధ్యాయుల ద్వారానే జరుగుతుందని తెలిపారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ నెహ్రూ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఫిజికల్ డైరెక్టర్ ఉపాధ్యాయిని సరళ బాలల ప్రతిజ్ఞతో కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఖాదర్ భాషా, డి వెంకటరమణ, శ్రీరాములు, విజయలక్ష్మి ఆదిలక్ష్మి, మణెమ్మ, ధనలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ సరళ, సిఆర్ఎంటి మదన్, మధ్యాహ్న భోజన నిర్వాహకులు సుజాత, బత్తెమ్మ, ఆయమ్మ, వాచ్మెన్ మురళి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply