భీమ్ న్యూస్ ప్రతినిధి పుట్టపర్తి (నవంబర్ 16) ఎంతో కాలంగా స్వార్థం లేని స్నేహం చేసిన వారు.. కూడా క్షణాకావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఎన్నో ఏళ్లు బతకాల్సిన నిండు ప్రాణాలు.. అర్ధాంతరంగా గాల్లో కలిసిపోతున్నాయి.ఈ మధ్య ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. పక్కనున్న స్నేహితులే శత్రువుల్లా మారుతున్నారు. ఈ రోజుల్లోచిన్న చిన్న విషయాలకే గొడవ పడి ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎక్కువగా ఉంటున్నాయి.
తాజాగా అలాంటిదే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దారుణం చోటుచేసుకుంది. ఫ్రెండ్స్ చేసే ర్యాగింగ్ కు బీటెక్ విద్యార్థి బలి అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పుట్టపర్తిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో.. ప్రేమ్‌సాయి అనే యువకుడు బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నాడు.
ర్యాగింగ్ చేయడంతోనే :
అదే కాలేజీలో చదువుతున్న కొందరు విద్యార్థులు ప్రేమ్ సాయిని ర్యాగింగ్ చేశారు. దీంతో ప్రేమ్ సాయి తీవ్ర మనస్థాపం చెందాడు. వెంటనే జరిగిన విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. ఇక ప్రేమ్ సాయి కాలేజీ యాజమాన్యానికి కంప్లైట్ చేయడంతో.. విద్యార్థులు ప్రేమ్ సాయి పై కక్షపెంచుకున్నారు.దీంతో అవకాశం కోసం వెయిట్ చేశారు. అదే క్రమంలో ప్రేమ్ సాయిని కాలేజ్ గ్రౌండ్లో దారుణంగా కొట్టారు. రెండు రోజుల క్రితం ప్రేమ్ ఇంటికి వెళ్లగా.. అతడి పేరెంట్స్ ప్రేమ్ సాయి శరీరంపై ఉన్న దెబ్బలు చూసి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే ప్రేమ్ చెవి లోపలి భాగం తీవ్రంగా దెబ్బతిన్నదని డాక్టర్స్ తెలిపారు.
ఇక దానికి గల కారణాన్ని పేరెంట్స్ తెలుసుకున్నారు. కాలేజీలో తమ కుమారుడు ప్రేమ్ సాయి పై ర్యాగింగ్ జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఇక పేరెంట్స్‌కు ఆ విషయం తెలియడంతో ప్రేమ్ సాయి ఆత్మహత్యపై , తమ అబ్బాయిని కొట్టడం వల్లే ప్రేమ్ చనిపోయాడని విద్యార్థి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, చెట్టంత కొడుకును కోల్పోయామని తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.
Leave a Reply