భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (నవంబర్ 16) ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తో ఉద్యోగార్థులు కోసం పరీక్షకు సన్నద్ధం అవుతున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేదల కోసం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీబీసీ స్టడీ సర్కిల్లో మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈసందర్భంగా శనివారం తిరుపతిలో డిఎస్సీ ఉచిత కోచింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ అవకాశాన్ని బలహీన వర్గాల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Leave a Reply