భీమ్ న్యూస్ ప్రతినిధి సత్యవేడు (నవంబర్ 16) తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు జ్యోతీరావు పూలే గురుకుల పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు విషజ్వరాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని విషయం తెలుసుకొన్న తిరుపతి ఎంపీ డా మద్దిల గురుమూర్తి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నూకతోటి రాజేష్ తో కలిసి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వారికీ వైద్యసేవల గూర్చి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.అనంతరం వసతిగృహంలోని భోజనశాలను ఎంపీ పరిశీలించారు. వంటశాలలో నాసి రకం కూరగాయలు ఉపయోగిస్తుండడం గమనించి హాస్టల్ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకి మెనూ ప్రకారం భోజనం అందించాలని వార్డెన్ కి సూచించారు.
హాస్టల్ లో నాశిరకం కూరగాయలు వినియోగించడంపై జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు దృష్టికి తీసుకెళ్లి ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.పాఠశాలలో విద్యార్థులు చదువుకొనేందుకు ఆరోగ్యకర వాతావరణం కల్పించాలని, త్రాగునీరు, మరుగుదొడ్లు మరమత్తులు మరియు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు పంపితే ఎంపీ నిధుల నుండి మంజూరు చేస్తామని అందుకుఅవసరమైన ప్రతిపాదనలు పంపవలసినదిగా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Leave a Reply