భీమ్ న్యూస్ ప్రతినిధి నెల్లూరు (నవంబర్ 17) ఏపీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసే దిశగా పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న సమయానికి అదనంగా మరో గంట పెంచేందుకు సిద్ధమైంది. తొలుత నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా పనివేళలల పెంపును అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి 4 గంటల వరకు నడుస్తున్నాయి. దీనిని ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమలు చేయనుంది.
నెల్లూరు జిల్లాలోని ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాలలో గానీ, హైస్కూల్ ప్లస్‌లో గానీ కొత్త టైం టేబుల్ అమలు చేయాలనే యోచనతో నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25 నుంచి 30వ తేది వరకు ఈ టైం టేబుల్‌ను అమలు చేసి ఫీడ్‌బ్యాక్ అందించాలని ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది స్వాగతిస్తుండగా, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనా ఫీడ్ బ్యాక్ వచ్చేంతవరకు ఆగాల్సిందే మరి.
Leave a Reply