భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (నవంబర్ 19) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు, కొరుటూరు గ్రామాలలో మండల వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి ఏ.డి.ఏ. లు శేషగిరిరావు, నర్సోజిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏ.డి.ఏ. ఏ.రాజ్ కుమార్ మాట్లాడుతూ, పచ్చిరొట్ట ఫైర్లు పూత దశకు వచ్చిన తర్వాత రోటవేటర్ సహాయంతో బాగా దున్నుకొని ఒక ఎకరాకు 100 కేజీల సింగల్ సూపర్ ఫాస్పేట్ వేసుకొని బాగా కలియ దున్నుకోవాలి. కాండంతొలుచు పురుగు మరియు వేరు కుళ్ళు తెగులు నివారణకు నారుమడిలో కార్బోఫిరన్ గుళికలు 3g వేసుకోవడం వల్ల ప్రధాన పొలం ని ఆశించకుండా ఉంటాయని తెలిపారు.
అనంతరం ఏ.డి.ఏ. నర్సోజీరావు మాట్లాడుతూ, నారుమడిలో జింక్ లోపం నివారణకు ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్యకాలంలో RNR 15048 నారు మరియు నాట్లకు అనుకూలమని, వరి నాట్లు నాటుకొని రైతులు ఆకుల కొసలు తెంచుకొని నాటుకోవటం వల్ల కాండం తొలుచు పురుగు ప్రధాన పొలంలోకి రాకుండా ఉంటుందని తెలియజేశారు. మండల వ్యవసాయధికారి డి. రఘునాథరెడ్డి మాట్లాడుతూ BPT-5204 వరి రకం నారును 25 నుంచి 30 రోజు లోపల నాట్లు నాటు కోవటం వల్ల దిగుబడులు ఎక్కువగా వస్తాయని, నారు నాటిన 12 రోజుల నుంచి 14 రోజులు లోపల కలుపు నివారణ కోసం నామినిగొల్డ్ వాడుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి.ఏ.ఏ. నరహరి, పెంచలయ్య, కొరుటూరు నాయకులు గండవరపు అమర్నాథ్ రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Leave a Reply