భీమ్ న్యూస్ ప్రతినిధి సత్యవేడు (నవంబర్ 20) తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం శాఖ గ్రంథాలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరిగిన గ్రంథాలయ వారోత్సవాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎంఈఓ బాబాయ్య ఆధ్వర్యంలో బహుమతులు అందజేసినట్లు గ్రంథాలయ అధికారి హరి తెలిపారు. విద్యార్థులు నిరంతరం గ్రంథాలయాలకు వెళ్లి జ్ఞాన సముపార్జన పెంపొందించే విధంగా తమకు కావలసిన పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి బాబయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి హరి, భాస్కర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Leave a Reply