భీమ్ న్యూస్ ప్రతినిధి సూళ్లూరుపేట (నవంబర్ 21) గత నెలలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన జై భీమ్ అంకయ్యని స్థానిక సూళ్లూరుపేట దళితనాయకులు కలిసి పరామర్శించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గాయపడిన అంకయ్య సూళ్లూరుపేట మండల విద్యాశాఖాధికారి కార్యాలయం నందు రిసోర్స్ టీచర్ గా పనిచేస్తుంటారు. తన విధులు పూర్తి చేసి, ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ ఢీకొని తీవ్రంగా గాయపడి, సమీప నాయుడుపేట లోని ట్రినిటీ హాస్పిటల్ లో విరిగిన కాలుకి సర్జరీ చేయించుకున్నారు.
ఈ సందర్భంగా వి సి కె పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇంచార్జ్ మల్చి చెంగయ్య, పిట్లచిన్నా, అక్కరపాక కిషోర్, గురుమూర్తి, శ్రీరాములు తదితర దళిత నాయకులు జై భీమ్ అంకయ్యను కలిసి పరామర్శించారు.
Leave a Reply