భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (నవంబర్ 22) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ ను పర్యాటక కేంద్రంగా మార్చుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదంతో నెల్లూరు రూరల్ మండలంలోని 3వ మైలు నుండి ఇందుకూరుపేట మండలంలోని మైపాడు సముద్రం బీచ్ వరకూ 48 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో నాలుగు లైన్లు రోడ్డు వేస్తున్న విషయం తెలిసిందే. రోడ్డు కాంట్రాక్టర్ పైడాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన శర వేగంగా జరుగుతున్నాయి.
అయితే ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట పంచాయతీలోని యాగర్ల సెంటర్ వద్ద నుండి మైపాడు వరకూ రోడ్డు పనులు చేసుకుంటూ వెళుతున్న క్రమంలో ప్రస్తుతం వున్న రోడ్డు పక్కన సుమారు రెండు అడుగుల లోతు వరకూ జే.సీ.బి. లతో మట్టిని తవ్వి, టిప్పర్ లారీలకు లోడ్ చేసుకుని నెల్లూరు రూరల్ మండలం సౌత్ రాజుపాలెం వద్ద నున్న గుంట స్థలంలో అన్ లోడ్ చేయగా, ఆ మట్టిని జే.సీ.బి. తో చదరం చేస్తున్నారు. టిప్పర్ లారీలతో కంకర లోడు తీసుకుని వచ్చి అదనపు రోడ్డు వేస్తున్న ప్రదేశంలో అన్ లోడ్ చేసి, మట్టిని లోడ్ చేసుకుని సౌత్ రాజుపాలెం గుంట స్థలం వద్దకు వెళుతుండటం గమనార్హం.
మీడియా ద్వారా ఆర్ అండ్ బీ అధికారులకు సమాచారం అందించినా కానీ, చర్యలేవీ తీసుకోకుండా మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటో లోగుట్టు పెరుమాళ్ కెరుక. కేంద్ర ప్రభుత్వ నిధులతో నాలుగు లైన్లు రోడ్లు వేస్తున్న కాంట్రాక్టర్ స్థానిక మండల అధికారులను ప్రలోభ పెట్టి, ఇలా అక్రమంగా మట్టిని తరలించి, ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని, అసలు ఏం జరుగుతుందో.. ఎవరి చేతివాటం ఎంతో.. అని మండల ప్రజల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Leave a Reply