భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (నవంబర్ 24) నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్, ఇందుకూరుపేట మండలాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులతో 40 అడుగుల రోడ్డు వేస్తున్నారు. రోడ్డు మార్జిన్ లో తవ్వుతున్న మట్టిని అక్రమంగా తరలించి మరొక ప్రైవేటు స్థలంలో డంప్ చేస్తున్న సమాచారం మీడియా ద్వారా అటు ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పంచిందిన సీపీఎం నేత షేక్ షాన్ వాజ్, తన పార్టీ సభ్యులతో సౌత్ రాజుపాలెంలో మట్టిని డంప్ చేస్తున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం డేవిస్ పేట పంచాయతీ రొయ్యల కంపనీ వద్ద రోడ్డు మార్జిన్ లో మట్టిని తీస్తూ టిప్పర్ లారీలకు లోడ్ చేస్తున్న సమయంలో ఆ స్థలానికి చేరుకుని తమ నిరసనలు తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షాన్ వాజ్ మాట్లాడుతూ పైడాల తిరుపతి రెడ్డి అనే కాంట్రాక్టర్ 48 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో వేస్తున్న 40 అడుగుల రోడ్డు మార్జిన్ లో మట్టిని జేసిబిలతో తవ్వి, తరలించి అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. సామాన్య మానవుడికి మట్టిని కొనుగోలు చేయాలంటే అధిక భారమైన నేటి పరిస్థితుల్లో వుండే మట్టిని తరలించి అక్రమంగా విక్రయించడం మంచి పద్దతి కాదని అభిప్రాయపడ్డారు. ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని, కాంట్రాక్టర్ అధికారులను ప్రలోభపెట్టి తన పనులను చేస్తున్నాడని ఆరోపించారు. డేవిస్ పేట పంచాయతీలోని లే అవుట్ లు పంచాయతీకి ఇచ్చిన పదిశాతం భూమిలో ఈ మట్టిని డంప్ చేయవచ్చును కదా అని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ విషయంపై స్థానిక ఎంఎల్ఏ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ లు వెంటనే స్పందించి, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ పక్షంలో ప్రజాధర్నాను చేపట్టి కలక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Leave a Reply