భీమ్ న్యూస్ ప్రతినిధి చేజర్ల (నవంబర్ 26) కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జాతిని జాగృత పరిచిన తమ మహా నాయకుడు, జాతి నిర్మాత భారతరత్న డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ కి భారత్ మహాసేన నాయకులు నెల్లూరు జిల్లా చేజర్ల బస్టాండ్ సెంటర్ మరియు తిమ్మాయపాలెం గ్రామాల్లోని బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం జై భీమ్ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా భారత్ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు జువ్వుగుంట బాబు మాట్లాడుతూ రాజ్యంగ రచన ద్వారా ఈ దేశ మూలవాసులకు నిరాకరించిన హక్కులను తన (అంబేడ్కర్) అలుపెరగని పోరాటంతో ప్రతీ ఒక్కరికి సమానంగా అందించి దళిత, బహుజనులలో ఆత్మగౌరవం నింపిన మహానుభావుడు డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ అని తెలిపారు. రాజ్యంగ రూపశిల్పి భారతరత్న, బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ ని స్మరించుకుంటూ ఆయన సుధీర్ఘ పోరాటాన్ని కొనసాగిస్తాం అని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బి.ఎం.ఎస్. ప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply