భీమ్ న్యూస్ ప్రతినిధి సంత బొమ్మాళి (నవంబర్ 26) శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ రాజ్యాంగ దినోత్సవము ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పాఠశాల ఆవరణలోగల రాధాకృష్ణన్, గాంధీ, అబ్దుల్ కలాం, వివేకానంద విగ్రహాలకు ప్రదానోపాధ్యాయులు కె.చైతన్య , ఉపాద్యాయులు పూలమాలాలంకృతులను చేశారు. తరువాత పాటశాల విద్యార్ధులును ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు కె. చైతన్య మాట్లాడుతూ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. నవంబర్ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే ఏటా ఈరోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారనీ, రాజ్యాంగము ప్రతీ భారతీయునికి పవిత్రగ్రంథమని దీనిని గూర్చి ప్రజలలో అవగాహన కలిగంచడానికి ఈ రాజ్యాంగ దినోత్సవము జరుపుకుంటున్నామని తెలుపుతూ, భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగసభ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ సారధిగా డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటైంది. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు. రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించాలన్నది ఆయన ప్రధానాశయమని తెలుపుతూ, అందరితో రాజ్యాంగ పీఠికను బృంద పఠనము చేయించి రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు.
తెలుసుకుందాం తెలుసుకుందాం – మన రాజ్యాంగాన్ని గురించి తెలుసుకుందాం
మన పవిత్ర గ్రంథం – మన రాజ్యాంగం.
అనుసరిద్దాం అనుసరిద్దాం – రాజ్యాంగాన్ని అనుసరిద్దాం
అనంతరం సాంఘికశాస్త్ర ఉపాధ్యాయినులు పార్వతి, ఉమా రాజ్యాంగంలోని పలు అంశాలను విద్యార్థులకు వివారించారు. ఈ సందర్భగా రాజ్యాంగముపై విద్యార్థులకు క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, వీరభద్రరావు, ఆదికేశవరెడ్డి, లక్ష్మీకాంతం, తిరుపతిరావు, నాగేశ్వరరావు, లక్ష్మి, ఉమ, చిన్నారావు, రాము, మురళీధరరాజు, రవికుమార్, విజయలక్ష్మి, మార్కండేయులు, దయాసాగర్, శ్రీనివాసరావు మరియు పాటశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Leave a Reply