భీమ్ న్యూస్ ప్రతినిధి గూడూరు (నవంబర్ 26) తిరుపతి జిల్లా గూడూరులో భారత రాజ్యాంగం ఆవిర్భావం గురించి, రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలను గురించి విద్యార్థులు తప్పక అవగాహన కల్గి ఉండాలని గూడూరు ఎస్ కె ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కే శివప్రసాద్ మాట్లాడుతూ నేడు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగ ఫలితమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమ సమాజ స్థాపన నిర్మాణం ప్రారంభించారని కొనియాడారు. రాజ్యాంగ రచన విశిష్టతను తెలియజేసి నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు రాజ్యాంగ ప్రవేశికను పఠించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వై శ్రీనివాసులు, రవి రాజు, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఎస్. కె.ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బెంగుళూరు కి చెందిన ఇంట్రన్జ్ లెర్న్ సంస్థ ప్రతినిధులు ఇంటర్న్ షిప్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శివ ప్రసాద్ మాట్లాడుతూ ఇంటర్న్ షిప్ ల ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకుని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు , కంప్యూటర్ అధ్యాపకులు మైమూన్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply